Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Two killed in road accident at Patancheruసంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పటాన్‌చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్‌ వద్ద ఓ బైక్‌ను వేగంగా వచ్చిన టిప్పర్‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న  ఇద్దరు ఘటనాస్థలిలోనే చనిపోయారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. మృతుల వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  .