Home తాజా వార్తలు హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం : ఇద్దరు మృతి

హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం : ఇద్దరు మృతి

Two killed in road accident in Hyderabadహైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ కింది నుంచి వేగంగా వచ్చిన ఇటుకల లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  ఇద్దరు యువకులు ఘటనాస్థలిలోనే చనిపోయారు. మూసాపేట నుంచి ఎర్రగడ్డ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. మృతుల వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.