Home ఖమ్మం ఖమ్మంలో ప్రమాదం: ఇద్దరు దుర్మరణం

ఖమ్మంలో ప్రమాదం: ఇద్దరు దుర్మరణం

Two killed in road accident in Khammam

కూసుమంచి: ఖమ్మం జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, డిసిఎం ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు స్పాట్ లోనే మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి మిషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కూసుమంచి మండలం చేగొమ్మ చౌరస్తా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Two killed in road accident in Khammam