Home అంతర్జాతీయ వార్తలు కోర్టు రూంలో ఇద్దరు న్యాయవాదుల కాల్చివేత

కోర్టు రూంలో ఇద్దరు న్యాయవాదుల కాల్చివేత

Two Lawyers Shot Deadబ్యాంకాక్ : కోర్టు రూంలో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు న్యాయవాదులు చనిపోయారు. ఈ ఘటన థాయ్‌లోని చందబురి ప్రొవిన్షియల్ కోర్టులో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఓ వారసత్వ ఆస్తి వివాదానికి సంబంధించి కోర్టు రూంలో విచారణ జరుగుతున్న సమయంలో ఆగంతకుడు కాల్పులకు దిగాడు. దీంతో ఇద్దరు న్యాయవాదులు చనిపోయారని, పోలీసులు ఆగంతకుడిని కాల్చి చంపినట్టు పోలీస్ ఉన్నతాధికారి క్రిస్సానా పట్టణ చరోయిన్ మీడియాకు తెలిపారు.  ఆగంతకుడు ఈ కాల్పులకు ఎందుకు తెగబడ్డాడో తెలియరాలేదని ఆయన చెప్పారు. పోస్టుమార్టం కోసం న్యాయవాదుల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో విచారిస్తున్నామని ఆయన వెల్లడించారు.

Two Lawyers Shot Dead In Courtroom At Thailand