Friday, April 26, 2024

ఆ సింహాల జంట ఆలనా పాలన ఏడాదిపాటు మాదే

- Advertisement -
- Advertisement -

జంతు దత్తత స్వీకరించి రూ. 2 లక్షల అందజేసిన హీరో రామ్‌చరణ్ సతీమణి : ఉపాసన
జూపార్కు నిర్వహణ, ఆరోగ్యకరమైన ప్రాణులు ఆకట్టుకున్నాయి : ఉపాసన
వన్యప్రాణ సంరక్షణ బలోపేతానికి అండగా నిలవండి : క్యూరేటర్ ఎస్.రాజశేఖర్

వణ్యప్రాణులపై ప్రేమను చాటుతున్న ప్రముఖులు

మన తెలంగాణ / రాజేంద్రనగర్: వన్యప్రాణుల పట్ల ప్రేమ, ఆప్యాయతలు చూపడమే కాదు వాటి ఆలన, పాలనకు ఆర్థికంగా ఉన్న ప్రతి ఒక్కరూ చేయుతనివ్వాలని ఆపోలో ఫౌండేషన్ అపోలో లైఫ్ వైస్ ప్రెసిడెంట్ ఉపాసన కామినేని కొణిదెల తనవంతు సహకారం అందించి వైల్డ్‌లైఫ్ ఛాలెంజ్ విసిరారు. నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో రెండు వేలకుపైగా ఉన్న అరుదైన జంతువులు, ప క్షులు, సరీసృపాల ప్రదర్శ వరకే చాలా మందికి తెలుసు. వాటి ఆలన, పాలన భారీ వ్యయం, చాలా సున్నితమైనదిగా ఉంటుందని తెలుసుకోవాలనే ప్రయత్నం చేసే వారు చాలా తక్కువే. కరోనా కష్టకాలం నుంచి ఇక్కడి జంతువులు, పక్షుల పట్ల ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్న ఉపాసన శనివారం కామినేని అనూషలతో కలసి రెండు లక్షల రూపాయల చెక్కును క్యూరేటర్ ఎస్.రాజశేఖర్, డిప్యూటీ క్యూరేటర్ ఎ.నాగమణిలకు అందజేసి తనవంతుగా భారత సంతతికి చెందిన సింహాల జతను దత్తతకు స్వీకరించారు. కరోనా లాక్‌డౌన్ తదితర కా రణాలతో సందర్శకుల సంఖ్య తగ్గి జూపార్కు రెవిన్యూ భారీగా పడిపోయింది. ఇక పెద్దపులు, సింహాలు, చిత, చిరుత, ఏనుగులు ఇలా అనేక రకాల వన్యమృగాలు, ప్రాణుల నిత్యం అందించే ఆహారం, ఆరోగ్య పరిరక్షణకు వైద్య సేవలు ఖరీదైనవే అయినా నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటి తో పలు ఫార్మ , ఐటి కంపనీలు, బ్యాంకింగ్‌రంగ సంస్థలు, ఔత్సహికులు అటవీశాఖ వన్యప్రాణి విభాగం జూపార్కులో అందుబాటులో ఉంచిన యానిమల్ అడాప్షన్ స్కీమ్ ద్వారా కొంత ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈవిషయం తెలుగు చిత్ర పరిశ్రమ న టీనటులు జూపార్కు చూడాలని, తమకు నచ్చిన యానియల్స్ లేదా బర్డ్ దత్తతకు తీసుకోవాలని ఉత్సాహం చూపుతున్నారు. దీంతో కొంతభారం వన్యప్రాణుల నిర్వాహనలో జంతుదత్తత ద్వారా తీరుతుందని అధికారులు అంటున్నారు.
జూపార్కు నిర్వహణ, ఆరోగ్యకరమై ప్రాణులు ఆకట్టుకున్నాయి : ఉపాసన కామినేని కొణిదెల
నెహ్రూ జూలాజికల్ పార్కును సందర్శించడానికి వచ్చిన తనకు ఇక్కడి సిబ్బంది సేవలు, అధికారుల నిర్వాహణ జంతువులు ఆరోగ్యంగా ఉండడాన్ని గుర్తించానని ఉపాసన కామినేని కొనిదెల అన్నారు. దీంతో తనంతుగా జూపార్కులోని వన్యప్రాణుల నిర్వాహణకు చేయుతనివ్వాలని నిర్ణయించి అసియాటిక్ సింహాల జంటను దత్తతకు స్వీకరించడం జరిగిందన్నారు. జంతువులు, పక్షులకు సేవ చేస్తున్న సిబ్బంది సేవలను ఆమె అభినందించారు. జూపార్కు పరిసరాల పరిశుభ్రత పట్ల అధికారులు తీసుకుంటున్న చర్యలు సంతోషకరంగా ఉన్నాయన్నారు.
వన్యప్రాణుల సంరక్షణ బలోపేతానికి అండగా నిలవండి – క్యూరేటర్ ఎస్.రాజశేఖర్
జూపార్కులో ప్రదర్శనలో ఉంచే వన్యప్రాణులను తిలకించి ఆనందించే సందర్శకులు వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేయడానికి అండగా నిలవాలని క్యూరేటర్ ఎస్. రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఉపాసన కామినేని కొనిదెల యానిమల్ అడాప్షన్‌లో చేరడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఏడాది కాలం పాటు అసియాటిక్ సింహాలు విక్కి, లక్ష్మీ జంట ఆలన,పాలనకు ఉపాసన, అనూష్పల ముందుకు రావడం వారికి వన్యప్రాణుల సంరక్షణ పట్ల ఉన్న ఆసక్తికి నిదర్శనమన్నారు.ప్రతి ఒక్కరూ జూపార్కులోని వన్యప్రాణులు దత్తతకు తీసుకోవడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News