Home కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎన్‌కౌంటర్

ఎన్‌కౌంటర్

Two Maoists killed in Asifabad encounter

 

ఆసిఫాబాద్ జిల్లాలో ఎదురుకాల్పులు ఇద్దరు మావోయిస్టులు మృతి
తప్పించుకున్న కీలకనేత భాస్కర్

మనతెలంగాణ/హైదరాబాద్ : అసిఫాబాద్ జిల్లాలో శనివారం రాత్రి జరిగిన ఎంకౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. కడంబా అడవుల్లో పోలీసులకు నక్సలైట్లు మధ్య ఎదురు కాల్పులలో ఇద్దరు మావోలు మృతి చెందగా మైలవరపు అడేళ్లు అలియాస్ భాస్కర్, వర్గీస్. కాంతీ లింగలు తృటిలో తప్పించుకున్నారు. గ్రేహౌండ్స్ దళాలు సంఘటన స్థలంలో రెండు తుపాకులు. బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో ఘటనాస్థలంలో రెండు మృత దేహాలను గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కాగా ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి తప్పించుకున్న మావోయిస్టు నేతల కోసం అడువులను పోలీసులు జల్లెడపడుతున్నారు.