Friday, April 26, 2024

ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం క్రైమ్‌ః తెలంగాణ ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఒక యాక్షన్ టీం పోలీసు వారిపై దాడి చేయాలనే లక్షంతో సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. పోలీసులపై ఆదివారం ఉదయం పుట్టపాడు (కిష్టారం పిఎస్) అటవీ ప్రాంతంలో సుమారుగా 6.10 గంటలకు అకస్మాత్తుగా ఒక ఎత్తైన ప్రదేశం నుంచి మావోయిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తిరిగి ఎదురు కాల్పులు జరిపారు. కొన్ని నిమిషాల పాటు మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

Also Read: ప్రియాంక గాంధీ పర్యటన.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కెటిఆర్

అనంతరం ఎదురు కాల్పులు జరిగిన ప్రదేశంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి రెండు మృతదేహాలు, ఒక ఎస్‌ఎల్‌ఆర్ ఆయుధం, ఒక సింగల్ బోర్ తుపాకి , ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రెండు మృతదేహాల్లో ఒకరు చర్ల ఎల్‌ఓఎస్ కమాండర్ మడకం ఎర్రయ్య అలియాజ్ రాజేష్‌గా గుర్తించడం జరగింది. మరొక మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News