Home తాజా వార్తలు ఆటోను ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి

ఆటోను ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి

 

జక్రాన్‌పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ క్రాస్ రోడ్డులో సోమవారం మధ్యాహ్నం ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జక్రాన్‌పల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ రాము నాయుడు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతులు పైడి సత్తెమ్మ, సుందరమ్మగా గుర్తించారు. శవ పరీక్ష నమిత్తం మృతదేహాలను ఆర్మూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ అంతరాయం కలగడంతో వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.

 

Two Members Dead in Auto Collided to Lorry in NZBD