Home తాజా వార్తలు ఒఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్లు మృతి

ఒఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్లు మృతి

Two Members dead in ORR Accident in Rangareddy

 

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేటలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ఇన్నోవా డిసిఎం వాహనాలను మరో డిసిఎం ఢీకొట్టడంతో డిసిఎం డ్రైవర్లు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.