Home తాజా వార్తలు ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మృతి

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మృతి

 

 

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం బాసాయ్ డంగ్ పోలీస్ స్టేషన్‌పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇసుక మాఫియా డంగ్ సమీపంలో ఉన్న వాగులో ఇసుకను తరలిస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు చుట్టుముట్టారు. దీంతో పోలీసులపై ఇసుక మాఫియా  కాల్పులు జరిపింది. వెంటనే పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు ఇసుక మాఫియా దుండగులు హతం కాగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పుల్లో ఒక కానిస్టేబుల్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడిన పోలీస్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Two Members Dead in Police Firing in Rajastan