Home తాజా వార్తలు అల్యూమినియం కరిగిస్తుండగా భారీ పేలుడు

అల్యూమినియం కరిగిస్తుండగా భారీ పేలుడు

 

మన తెలంగాణ/నిర్మల్ ప్రతినిధి: పాత అల్యూమినియం వస్తువులను కరిగిస్తుండగా ప్రమాదవశాత్తు పెట్రోల్‌తో కూడిన రసాయన వస్తువు భారీగా పేలడంతో ఘోర ప్రమాదం స్థంభవించిన సంఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఈద్‌గాం చౌరస్తాలో చోటు చేసుకుంది. అడిషనల్ ఎస్పి దక్షిణామూర్తి, సిఐ జాన్‌దివాకర్ తెలిపిన వివరాల ప్రకారం… పట్టణంలోని ఈద్‌గాం వీధిలో బుధవారం మధ్యాహ్నం ప్రాంతంలో భారీ పేలుడు సంభవించడంతో సాహిదాబేగాం(50), హైమద్(22) అనే తల్లికొడుకులను తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

 

Two Members Injured in Bomb Blast in Nirmal