Home తాజా వార్తలు టిప్పర్ లారీను ఢీకొట్టిన కారు : ఇద్దరు మృతి

టిప్పర్ లారీను ఢీకొట్టిన కారు : ఇద్దరు మృతి

Road-accident

రంగారెడ్డి: హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన  కడ్తాల్ లోని మైసిగండి వద్ద చోటుచేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్, లారీని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.  ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ఘటన స్థలిలోనే మృతి చెందగా.. మరో ఏడుగురు  తీవ్రంగా గాయాపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్నపోలీసులు కేసు నమోదు చేసి మృత దేహలను శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరలోని దవాఖానకు తరలించారు.