Home తాజా వార్తలు సినిమా చూపిస్తానని 11 ఏళ్ల బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం…

సినిమా చూపిస్తానని 11 ఏళ్ల బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం…

Rape

 

ఒకరి తరువాత ఒకరు పాపపై అత్యాచారం
కామాంధులకు స్థానికుల దేహశుద్ధి

మాదన్నపేట్ : ఇస్మార్ట్ శంకర్ సినిమా చూపిస్తానని 4వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలికపై ఇద్దరూ కామాంధులు అత్యాచారం చేసిన సంఘటన శనివారం రాత్రి సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం సైదాబాద్ సింగరేణి కాలనీ చెందిన జైరాం,పద్మాలకు ఇద్దరూ సంతానం. 6 సంవత్సరాల క్రితం తండ్రి చనిపోయాడు. అనంతరం తల్లి మతిస్థిమితం పోవడంతో పిల్లలు అనాథలయ్యారు.

బంధువులు, కొడుకును చార్మినార్ హాస్టల్‌లో,పాపను తుర్కయంజాల్‌లోని లార్ట్ కాన్సప్ట్ పాఠశాలో చేర్పించారు. హా స్టల్‌కు ఆదివారం సెలవు రావడంతో పాప సింగరేణి కాలనీలోని అ మ్మమ్మ దగ్గరకు వచ్చి ఆడుకుంటుంది. అదే ప్రాంతానికి చెందిన ఇస్లావాత్ దస్రు(23) జోమోటోలో పుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు,అతని స్నేహితుడు మోతిలాల్(27) చెత్త అమ్ముకునే వృత్తి.

వీళ్లిద్దరూ శనివారం సింగరేణి కాలనీలోని బాబాయి ఇంటికి వచ్చిన 4వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల పాపపై కన్ను పడింది. ఈ పాపకి సినిమా చూపిస్తానన్ని చెప్పడంతో ఆ పాప అత్త కూతురైన 8 ఏళ్ల పాపను తోడుగా తీసుకెళ్లింది. ఆ కామాంధులు మొదట సినిమా థియేటర్‌కు తీసుకెళ్లి టిక్కెట్లు కొనుగోళ్లు చేశారు. సినిమా మొదలు కావడానికి సమయం ఉందన్ని చెప్పి ఎదురుగా ఉన్న పాత భవనం సెల్లార్‌లోకి తీసుకెళ్లారు.

8 ఏళ్ల పాపను బయట కూర్చోబెట్టి మొదట దస్రు 11 ఏళ్ల పాపపై అఘాయిత్యం చేశాడు. తరువాత మోతిలాల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత పాపను సెల్లార్‌లో నుంచి తీసుకొని వస్తుండగా థియేటర్ సెక్యూరిటీకి అనుమానం వచ్చి పాపను ప్రశ్నించారు. పాప జరిగిన విషయం చెప్పడంతో స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి చంచల్‌గూడ జైల్‌కు తరలించారు. పాపకు మెడికల్ పరీక్షలు చేయించి భరోసాలో కౌన్సిలింగ్ ఇప్పించి పాప బాబాయికి అప్పగించారు.

Two Men Raped Girl