Home సినిమా రెండు సినిమాల డీల్

రెండు సినిమాల డీల్

Kyra-Advani

తెలుగులో తన తొలి చిత్రం ‘భరత్ అనే నేను’తో బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న బ్యూటీ కియారా అద్వానీ. ఆతర్వాత వెంటనే ఆమెకు రామ్‌చరణ్ సినిమాలో అవకాశం లభించింది. ప్రస్తుతం రామ్‌చరణ్ చిత్రంతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ మరోపక్క బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతోంది. వెబ్ మూవీ ‘లస్ట్ స్టోరీస్’తో అక్కడ మరింత ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సంజయ్‌దత్, వరుణ్‌ధావన్ నటిస్తున్న ‘కళంక్’ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు అక్షయ్‌కుమార్, కరీనాకపూర్ నటిస్తున్న మరో చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది కియారా. అయితే ఈ భామ తాజాగా  స్టార్ ఫిల్మ్‌మేకర్ కరణ్‌జోహార్‌తో రెండు సినిమాల డీల్ కుదుర్చుకుందట. తన ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌లో కరణ్ ఈ చిత్రాలను రూపొందించబోతున్నాడు. కియారా అందం, అభినయం చూసి ఆమెతో ఈ దర్శకనిర్మాత రెండు సినిమాల  ఒప్పందం కుదుర్చుకున్నాడట. దీంతో కియారా అద్వాని బాలీవుడ్‌లో మరింత బిజీ కాబోతోంది. అయితే అక్కడ ఎంత బిజీ అయినా తెలుగులోనూ సినిమాలు చేస్తానని ఆమె తన సన్నిహితులతో చెబుతోందట.