Saturday, April 20, 2024

రాష్ట్రంలో మరో రెండు కొత్త టోల్ ‌ఫ్లాజాలు

- Advertisement -
- Advertisement -
Two new toll plazas in Telangana

 

సెప్టెంబర్ కల్లా పూర్తి
ఈ రెండింటితో కలిపి మొత్తం రాష్ట్రంలో 20 టోల్‌ఫ్లాజాలు
నెలకు సుమారు రూ.80 నుంచి రూ.90 కోట్ల ఆదాయం
ఏప్రిల్‌లో రూ.11.66 కోట్లు, మే నెలలో రూ.59 కోట్లు, జూన్ మూడోవారానికి రూ.55.6 కోట్ల ఆదాయం
లాక్‌డౌన్ ఎత్తివేస్తే ఆదాయం మరింత పెరిగే అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరో రెండు కొత్త టోల్ ప్లాజాలు సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 18 టోల్‌ప్లాజాలు ఉండగా ప్రస్తుతం ఏర్పాటయ్యే రెండింటితో అవి 20కి చేరుకోనున్నాయి. మాములుగా టోల్‌ఫ్లాజాల ద్వారా నెలకు రూ.80 నుంచి 90 కోట్ల ఆదాయం సమకూరేది. లాక్‌డౌన్ నేపథ్యంలో సుమారు 50 రోజులకు పైగా ఆదాయం పడిపోయింది. అయితే లాక్‌డౌన్ సడలింపు నేపథ్యంలో వాహనాలను ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో టోల్‌ప్లాజాల వద్ద ఆదాయం పెరిగింది. మే నెలలో సుమారు రూ.59 కోట్లు, జూన్ నెలలో (21వ తేదీ వరకు) రూ.55.6 కోట్ల ఆదాయం టోల్‌ప్లాజాల ద్వారా సమకూరిందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు. ఈ రెండు ప్లాజాలు ప్రారంభమయితే ఆదాయం రెట్టింపయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు పేర్కొన్నారు. టోల్‌ప్లాజాలను విస్తరించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ (జాతీయ రహదారుల అథారిటీ సంస్థ) ప్రణాళికలను రూపొందించింది.

అందులో భాగంగా టోల్‌ప్లాజా ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్తగా నిర్మించబోయే రెండు టోల్‌ప్లాజాల్లో ఒకటి స్టేషన్ ఘన్‌పూర్ వద్ద (వరంగల్ జాతీయ రహదారి 163పై నిర్మాణం జరుగుతుండగా మరొకటి వరంగల్ బైపాస్ వద్ద నిర్మిస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ వద్ద నిర్మాణం జరుపుతున్న టోల్‌ప్లాజాల వద్ద ఆరు నుంచి ఎనిమిది గేట్లను ఏర్పాటు చేస్తుండగా, ఆర్‌ఎఫ్‌ఐడి ఆథారిత ఫాస్టాగ్ గేట్లను నిర్మిస్తున్నారు. రానున్న సెప్టెంబర్ వరకు ఈ రెండు టోల్‌ఫ్లాజాల నిర్మాణం పూర్తి అవుతాయని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెలలో రూ.11.66 కోట్లు రాష్ట్రంలోని 18 టోల్‌ఫ్లాజాల (ఫాస్టాగ్‌ల) ద్వారా సమకూరింది. ప్రతి నెల 18 టోల్‌ప్లాజాల ద్వారా సుమారు నెలకు రూ.80 నుంచి రూ. 90 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News