Home జాతీయ వార్తలు భవనం కూలి ఇద్దరు మృతి

భవనం కూలి ఇద్దరు మృతి

wo People Died In Building Collapsed In Punjabచండీగఢ్‌: భవనం కూలిన ఘటనలో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటన పంజాబ్‌ రాష్ట్రం మొహాలి జిల్లా డేరా బస్సీలో గురువారం జరిగింది. చాలా మంది శిథిలాల కింద చిక్కున్నారని అధికారులు తెలిపారు. పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ చర్యలు చేపట్టినట్టు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తెలిపాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.