Home తాజా వార్తలు గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు.. పరారీలో మరో నిందితుడు

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు.. పరారీలో మరో నిందితుడు

Two persons arrested for selling marijuana

 

హైదరాబాద్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను హబీబ్‌నగర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి 900 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని మంగళ్‌హాట్‌కు చెందిన దినేష్ సింగ్, ధూల్‌పేటకు చెందిన అర్జున్ సింగ్ పాన్‌షాపు నిర్వహిస్తున్నాడు. నాంపల్లి, జుమ్మెరాత్‌బజార్‌కు చెందిన రామకృష్ణ గంజాయి విక్రయిస్తున్నారు. హబీబ్‌నగర్ పిఎస్ ఎస్సై సైదులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు గంజాయిని పంచుకుంటున్నారు.

ఇది గమనించిన పోలీసులు వారి దగ్గరికి వెళ్తేండగా గంజాయి విక్రయించేందుకు వచ్చిన దినేష్ సింగ్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అర్జున్ సింగ్, రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 900 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దినేష్ సింగ్ గంజాయి అర్జున్ సింగ్, రామకృష్ణకు విక్రయిస్తున్నారు. వారు అవసరం ఉన్న వారికి గంజాయిని సరఫరా చేస్తున్నారు. అరెస్టు చేసిన ఇద్దరిని రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హబీబ్‌నగర్ పోలీసులు తెలిపారు.

Two persons arrested for selling marijuana in hyderabad