Home తాజా వార్తలు రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం : ఇద్దరు దుర్మరణం

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం : ఇద్దరు దుర్మరణం

Two Persons Died In Road Accident At Rangareddyరంగారెడ్డి : అబ్దుల్లాపూర్‌మెట్ మండ‌ల ప‌రిధిలోని బండరావిల గ్రామం సమీపంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  ఇద్దరు ఘటనాస్థలిలోనే చనిపోయారు. వేగంగా వచ్చిన టిప్పర్ టివిఎస్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. మృతులు పిల్లాయిపల్లికి చెందిన జంగయ్య, మహ్మద్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.