Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Two Persons Died In Road Accident In Kattangurన‌ల్ల‌గొండ : కట్టంగూర్ సమీపంలో  జాతీయ ర‌హ‌దారి 65పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.  రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న డిసిఎం వ్యానును వేగంగా వచ్చిన కారు  అదుపుత‌ప్పి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న అభి(30), రేణుక(28) అనే ఇద్ద‌రు ఘటనాస్థలిలోనే చనిపోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. బాధితులు హైద‌రాబాద్ ఇసిఐఎల్‌కు చెందిన‌వారిగా గుర్తించారు. వీరు కారులో విజ‌య‌వాడ‌కు వెళ్తుండ‌గా ప్ర‌మాదం జరిగింది.  పోస్టుమార్టం కోసం అభి, రేణుకల  మృత‌దేహాల‌ను న‌కిరేక‌ల్ ప్ర‌భుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు. కారు అతివేగంగా వెళ్లడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కట్టంగూర్  పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వారు వెల్లడించారు.