Home జనగామ విద్యుదాఘాతంతో వదిన, మరిది మృతి

విద్యుదాఘాతంతో వదిన, మరిది మృతి

Electric Shockజనగామ : లింగాల గణపురం మండల పరిధిలోని కుందారంలో సోమవారం విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యుదాఘాతానికి గురై వదిన, మరిది చనిపోయారు. కుందారం గ్రామానికి చెందిన అనంతోజు స్వాతి(36) ఇంటి ఆరు బయట ఉన్న తీగలపై బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది. ఈ క్రమంలో తన వదిన స్వాతిని రక్షించే క్రమంలో ఆమె మరిది కుమార్ చారి (26) కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో స్వాతి, కుమార్ చారి చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోవడంతో కుందారంలో విషాదం అలుముకుంది. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం స్వాతి, కుమార్ చారి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.