Home ఆంధ్రప్రదేశ్ వార్తలు మందుపాతర పేలి ఇద్దరు గిరిజనులు మృతి

మందుపాతర పేలి ఇద్దరు గిరిజనులు మృతి

10 Jawans Injured in Landmine Blast Triggered by Maoistsఅమరావతి : విశాఖ ఏజెన్సీలో దారుణం చోటు చేసుకుంది. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు గిరిజనులు చనిపోయారు. పెదబయలు మండలం కొండ్రు సమీపంలో సోమవారం ఈ ఘటన జరిగింది. పోలీసులను టార్గెట్ గా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై వారు కాలు మోపడంతో అది పేలి చనిపోయారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. మృతులు పెదబయలు మండలం చింతలవీధికి చెందిన మొండిపల్లి మోహన్ రావు(26), మొండపల్లి అజయ్ కుమార్ (20)గా పోలీసులు గుర్తించారు. తమ పశువులు కనిపించకపోవడంతో వారు ఆ ప్రాంతానికి వెళ్లి ప్రమాదం బారిన పడి చనిపోయారు. వీరి మృతితో చింతలవీధి గ్రామంలో విషాదం అలుముకుంది. పోస్టుమార్టం నిమిత్తం మోహన్ రావు, అజయ్ కుమార్ మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.