Friday, April 19, 2024

తాగి డ్యూటీ చేస్తున్న పోలీసుల సస్పెండ్‌

- Advertisement -
- Advertisement -

Two Police Constables Suspended At Penpahad

సూర్యాపేట: జిల్లాలోని పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్ కు గురయ్యారు. వారితో పాటు మరో ఇద్దరు హోంగార్డులను కూడా ఎస్పీ భాస్కరన్ సస్పెండ్ చేశారు. మద్యం తాగి విధులకు హాజరయ్యారని ఎస్పీ తెలిపారు. జూన్ 14వ తేదీన పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్ ను ఎస్పీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అతిగా మద్యం తాగి విధులు నిర్వహిస్తున్నారని తేలడంతో హెడ్ కానిస్టేబుల్ ఎస్. శ్రీరాములు, కానిస్టేబుల్ టి. లింగయ్యలపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ఎస్పీ మీడియాతో తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News