Home అంతర్జాతీయ వార్తలు ఇద్దరు పోలీసు అధికారుల కాల్చివేత

ఇద్దరు పోలీసు అధికారుల కాల్చివేత

GUNబోస్టన్ : అమెరికాలో దారుణం జరిగింది. బోస్టన్‌లో ఇద్దరు పోలీసు అధకారులను బుధవారం అర్ధరాత్రి దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు ఇంకా బయటకు రాలేదు. ఒక వ్యక్తి తుపాకీతో సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లిన పోలీసులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు అక్కడికక్కడే చనిపోయారు.ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.