Friday, March 31, 2023

రోడ్డుప్రమాదంలో ఇద్దరు శివస్వాములు మృతి

- Advertisement -

swamys
జడ్చర్ల: బాదేపల్లి పట్టణం రాఘవేంద్రస్వామి ఆలయం ఎదురుగా గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శివస్వాములు నవీన్(18). వడ్డె ప్రశాంత్(14)లు మృతిచెందారు. నేతాజి చౌరస్తా నుంచి రాజీవ్‌నగర్ కాలనీలోని సన్నిధానంకు స్కూటి పై వెళ్తున్న వారిని ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టడంతో ఎగిరి కిందపడటంతో ఇరువురికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిని 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో వారు మృతిచెందారు. మృతుల్లో నవీన్ బాదేపల్లి పట్టణం మాధవరావుకాంపౌడ్‌కు చెందిన బాలయ్య-సాయమ్మ దంపతుల కుమారుడు. ప్రశాంత్ తిమ్మాజిపేట మండలం గొరిట గ్రామానికి చెందిన ఆంజనేయులు-లక్ష్మిల కుమారుడు. ప్రస్తుతం రాజీవ్‌నగర్ కాలనీలో నివాసం ఉంటూ బాదేపల్లి జెడ్పిహైస్కూల్ లో 9వ తరగతి చదువుతున్నాడు. నవీన్ మిల్క్‌సెంటర్ లో పనిచేస్తుండగా, ప్రశాంత్ ఉదయం పేపర్‌వేయటం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఇద్దరు శివస్వాముల మృతితో రాజీవ్‌నగర్ కాలనీ, మాధవరావుకంపౌడ్, గొరిట గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. జడ్చర్ల పోలిసులు కేసు నమోదు చేసుకుని పంచనామా నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News