Home తాజా వార్తలు బందిపొరాలో ఎదురుకాల్పులు : ఇద్దరు జవాన్లకు గాయాలు

బందిపొరాలో ఎదురుకాల్పులు : ఇద్దరు జవాన్లకు గాయాలు

Armyశ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని బందిపొరి జిల్లా హైజిన్ గ్రామంలో భారత సైనికులు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గురువారం ఉదయం ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.