Home జాతీయ వార్తలు మహిళా అక్రమ సంబంధం.. జుట్టు కత్తిరించిన కొడుకులు

మహిళా అక్రమ సంబంధం.. జుట్టు కత్తిరించిన కొడుకులు

Widow Mother

 

రాజస్థాన్: మహిళ వేరొక వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకుందని కొడుకులు ఆమెను నడిరోడ్డుపై చితకబాది, జుట్టు కత్తిరించిన సంఘటన నాగౌర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లా, నింబి జోదా గ్రామానికి చెందిన ఓ మహిళ(45) దూరపు బంధువు(35)తో అక్రమ సంబంధం పెట్టుకొని 10 రోజుల క్రితం పారిపోయ్యారు. విషయం తెలుసుకున్న ఆమె ఇద్దరు కొడుకులు, బంధువులు చుట్టూ ప్రక్కల వారి గురించి గాలించగా, ఓ చోట ఉన్నట్టు సమాచారం అందింది. దీంతో కొడుకులు ఇద్దరు వెళ్లి వారిని పట్టుకొని అక్కడే దారుణంగా కోట్టి, స్వగ్రామానికి తీసుకోచ్చారు.

ఊరి నడిబొడ్డున బాధితులకు జట్టు కత్తిరించారు. ఇంతటితో ఆగకుండా ప్రియుడి మూత్రాన్ని తాగించే ప్రయత్నం చేశారు. ఓ వ్యక్తి ఈ ఘటనను ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ఆ వీడియో జిల్లా పోలీసులకు చేరడంతో వెంటనే  ఘటన స్థలానికి చేరుకొని బాధితురాలను స్థానిక దవాఖానకు తరలించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని బాధితులకు పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. కొడుకులిద్దరిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్టు జిల్లా ఎఎస్పి నితేశ్ ఆర్యా తెలిపారు.

Two sons is hair chopped of Widow and lover in Rajasthan