Thursday, April 25, 2024

ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలి వీరేంద్ర సెహ్వాగ్

- Advertisement -
- Advertisement -

Sehwag satires on Team India

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగడమే మంచిదని భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. తాజాగా పిటిఐ సంస్థతో మాట్లాడిన సెహ్వాగ్ ఫైనల్‌కు సంబంధించి తన అభిప్రాయాలను వెల్లడించాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల రూపంలో టీమిండియా మ్యాచ్ విన్నర్ స్పిన్నర్లు ఉండడం కలిసి వచ్చే అంశమన్నాడు. కివీస్‌తో జరిగే ఫైనల్లో వీరిద్దరూ ఇటు బంతితో అటు బ్యాట్‌తోనూ సత్తా చాటడం ఖాయమని జోస్యం చెప్పాడు. ఇక ఫైనల్లో ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగడమే ఉత్తమమన్నాడు. వీరిలో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలన్నాడు. ఇక జడేజా, అశ్విన్‌లు బ్యాటింగ్‌లోనూ మెరుగ్గా రాణించే సత్తా కలిగిన వారే కావడంతో మరో ప్రత్యేక బ్యాట్స్‌మన్ అవసరం జట్టుకు ఉండదని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇక ఫైనల్లో ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథి, వాగ్నర్ తదితరులతో టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడం ఖాయమన్నాడు. అయితే రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, మయాంక్‌లలో ఎవరూ ఓపెనర్లుగా దిగినా మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలువాలన్నాడు. వీరిపై ఆరంభం నుంచే ఎదురుదాడి చేస్తే ఒత్తిడి దరి చేరకుండా ఉంటుందన్నాడు. ఇక రిషబ్‌పంత్ తన సహాజ శైలీలోనే దూకుడుగా ఆడాలన్నాడు. పుజారా, రహానెలు రక్షణాత్మకమైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షించాలని సెహ్వాగ్ సూచించాడు. ఇదిలావుండగా ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో ఫైనల్ సమరం ఆసక్తికరంగా సాగడం ఖాయమని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News