Tuesday, April 16, 2024

కందకంలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

- Advertisement -
- Advertisement -

వెంటాడిన అడవి పందులు కందకంలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

మన తెలంగాణ/లింగంపేట: గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని బానాపూర్ నారాయణగూడ తండాలో ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. తాండావాసులు తెలిపిన వివరాల ప్రకారం లింగంపేట మండలంలోని బానాపూర్ నారాయణ గుడెం తండాలోని భుక్య లచ్చిరా ంతో పాటు ఆయన కుమారులు భుక్య జగన్, భుక్య శివ కలిసి మేకలు మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్ళా రు. ఇద్దరు కుమారులకు దప్పిక కావడంతో తండ్రిని తాగునీటి కోసం తండాకు పంపించారు. ఇద్దరు అన్నదమ్ములు మేకల వద్ద కాపలాగా ఉన్నారు. అదే సమయంలో దట్టమైన అటవీ ప్రాంతం నుండి అడవి పందులు వెంబడించడంతో భయపడి ఇద్దరు పరుగులు తీశారు. అటవీ ప్రాంత సమీపంలోని ఫారెస్ట్ గుంతలో భుక్య శివ (8) గుంతలో పడ్డాడు. గతంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా భారీ నీరు చేరింది. నీటమునిగాడు. తమ్మున్నికాపాడడానికి అన్న భుక్య జగన్ (10) కాపాడబోయి అక్కడే నీటమునిగాడు. మంచినీరు తీసుకొని తాండా నుంచి అటవీ ప్రాంతానికి మేకల వద్దకు వచ్చిన తండ్రికి కుమారులు కనిపించకపోవడంతో ఆచూకీ కోసం గాలించగా సమీపంలోని ఫారెస్ట్ గుంతలో శవమై తేలారు. దీంతో కుటుంబ సభ్యులకు తండా వాసులకు సమాచారం అందించారు. పెద్దఎత్తున తండావాసులు పరుగులు తీసి అక్కడికి చేరుకున్నారు. నారాయణ గూడెం తండాలో విషాదఛాయలు చోటుచేసుకున్నాయి.
అటవీశాఖ అధికారులపై గిరిజనుల ఆగ్రహం
అటవీశాఖ సరిహద్దు గుంతలు ఇద్దరు చిన్నారుల ప్రాణం తీయడంతో అటవీశాఖ అధికారుల తీరు పై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ సరిహద్దుల కోసం జేసిబి యంత్రాలతో పెద్దఎత్తున గుంతలు తీశారు. పశువులు మనుషులు గుంటలు దాటడానికి వీలు లేకుండా పోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గుంతల్లో నీరు చేరింది. ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసింది. 4ఏళ్లు క్రితం మండలంలోని కన్నాపూర్ తాండాలో అటవీశాఖ గుంతలో పడి ఇద్దరు మృతి చెందారు. బాధితుల తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Two students died after fell into a ditch in Kamareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News