- Advertisement -
షోపియన్: జమ్ముకశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదుల సహాయకులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. సోమవారం షోపియన్‌లోని డికె పోరా ప్రాంతంలో భారత సైన్యం, సిఆర్పిఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాద సహచరులను అరెస్టు చేశారు. వారి నుండి రెండు పిస్టల్స్, నాలుగు గ్రెనేడ్లు, 43 లైవ్ రౌండ్లు, ఇతర ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు, తదుపరి దర్యాప్తు జరుగుతోందని షోపియన్ పోలీసులు తెలిపారు.
- Advertisement -