Home జాతీయ వార్తలు బందిపొరాలో ఇద్దరు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌

బందిపొరాలో ఇద్దరు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌

Two Terrorists Encounter In Bandipora At Jammukashmirశ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని బందిపొరాలో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో  ఇద్దరు  ఉగ్రవాదులు హతమయ్యారు.  బందిపొరాలోని శోక్‌బాబా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు తారసపడిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. ఎదురుకాల్పుల్లో హతమైన ఉగ్రవాదులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో తెలియరాలేదన, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.