Home జాతీయ వార్తలు ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

Encounterశ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాష్ట్రం అనంత్‌నాగ్ జిల్లా బిజ్‌బెహరలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం ఉదయం ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులు తారసపడ్డారు. దీంతో భద్రతా బలగాలపై  ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన  భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి మూడు తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.

Two Terrorists Encounter in Bijbehara at Anantnag