Home జాతీయ వార్తలు ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

Two Terrorists Killed in Baramulla Naugam sector

న్యూఢిల్లీ: భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుపెట్టాయి. జమ్ముకాశ్మీర్ లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా నౌగామ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద భద్రతాదళాలు శనివారం తెల్లవారుజామున అనుమానాస్పద కదలికను గుర్తించాయి. దీంతో వారిపై కాల్పులు జరిపాయి. ఈ ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్టు ఆర్మీ పిఆర్ఒ ప్రకటించారు. ఘటనాస్థలిలో రెండు ఎకె-47 తుపాకులు, ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.

Two Terrorists Killed in Baramulla Naugam sector