Home జాతీయ వార్తలు ఎన్ కౌంటర్ లో ఇద్దరు తీవ్రవాదులు హతం

ఎన్ కౌంటర్ లో ఇద్దరు తీవ్రవాదులు హతం

One Army jawan martyred in encounter at Jammu Kashmir

 

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లోని కుల్గం ప్రాంతంలో ఆదివారం అర్ధ రాత్రి ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. అర్హే ప్రాంతంలో తీవ్రవాదులు సంచారిస్తున్నారని సమాచారం రావడంతో సిఆర్ఫిఎఫ్, భద్రతా బలగాలు ఉమ్మడిగా గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా బలగాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భారత సైనికులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హిజ్బుల్ ముజాహీద్దీన్ చెందిన ఇద్దరు తీవ్రవాదులు హతమైనట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఎకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

పశ్చిమ బెంగాల్ లోని 24 పరగాణా జిల్లాలో బంగ్లాదేశ్-భారత్ సరహద్దుల్లోని బాన్స్ ఘాటా ప్రాంతంలో బంగ్లాదేశ్ దుండగులు జరిపిని కాల్పుల్లో ముగ్గురు బిఎస్ఎఫ్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.