Home Default ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

Two Terrorists Killed In Shopian Encounter

 

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని చకురా ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. చకురా ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో జవాన్లపై ఉగ్రవాదులు ఎదురుకాల్పులు జరిపారు.

ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో మరింత శోధిస్తున్నట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భద్రతా దళాల సంయుక్త బృందం పాల్గొన్నది. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారో ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. ఈ ఘటనతో చకురా ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అపరిచితులకు ఆశ్రయం ఇవ్వొద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.

Two Terrorists Killed In Shopian Encounter