Home తాజా వార్తలు ఇద్దరు గిరిజనులను హత్య చేసిన మావోయిస్టులు

ఇద్దరు గిరిజనులను హత్య చేసిన మావోయిస్టులు

Maoistsభద్రాద్రి కొత్తగూడెం : మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. వారం రోజుల క్రితం గిరిజన గ్రామాలకు చెందిన ముగ్గురు  గిరిజన యువకులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. వీరిలో ఇద్దరు యువకులను మావోయిస్టులు శనివారం రాత్రి కాల్చి చంపారు. గిరిజన యువకుల కిడ్నాప్, హత్యతో ఏజెన్సీ ప్రాంతంలో అలజడి నెలకొంది. మరో యువకుడు ఇంకా మావోయిస్టుల అదుపులోనే ఉన్నాడు. పోలీసు ఇన్ ఫార్మర్లు అన్న నెపంతో మావోయిస్టులు తమను వేధింపులకు గురి చేస్తున్నారని గిరిజనులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Two Tribal Youngmen Shot Dead by Maoists