Home తాజా వార్తలు బౌన్స్ యాప్ తో టూ వీలర్ బుకింగ్ : రెండు రూపాయలతో ప్రయాణం

బౌన్స్ యాప్ తో టూ వీలర్ బుకింగ్ : రెండు రూపాయలతో ప్రయాణం

Bounce App

 

హైదరాబాద్ : పరేడ్ గ్రౌండ్ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద అసిస్టెంట్ సిపి అనిల్ కుమార్ బౌన్స్ యాప్ ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద ఎలక్ట్రిక్, పెట్రోల్ ద్విచక్ర వానాలను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ యాప్ ద్వారా ద్విచక్ర వాహనాన్ని బుక్ చేసుకొని నగరంలోని ఎక్కడి నుండి ఎక్కడికైన వెళ్లే అవకాశముందని, పొల్యూషన్ కంట్రోల్‌లో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ యాప్‌లో బుక్ చేసిన వాహనము బ్లూటూత్ ద్వారా లాక్ ఓపెన్ అవుతుందని, ఆన్‌లైన్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని, ఇది నగరంలో మూల ప్రాంతాలలోనై పార్కు చేసి వారు అప్పగించవచ్చున్నారు. కిలో మీటరు రెండు రూపాయలు మాత్రమేనని తెలిపారు. బైక్ విషయంలో ఏవైన సమస్యలు తలెత్తినప్పుడు వారి టీమ్ ఎప్పటికప్పుడు రడీగా ఉంటుందని మేనేజర్ ప్రభుత్వ రిలేషన్ ఆఫీసర్ సంజయ్ భార్గవ్ గాంధారి, డైరెక్టర్ ఆయుష్ జైన్‌లు తెలిపారు.

Two Wheeler Booking With Bounce App