మనతెలంగాణ/ఏటూరునాగారం : సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకొని తిరుగు ప్రయాణంలో ఏటూరు నాగారంకు ద్విచక్రవాహనం పై వస్తున్న ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రనికి చెందిన ముగ్గురు వ్యక్తులు మంగళవారం సాయంత్రం ఏటూరు నాగారం మండలకేంద్రంలోని పివో గెస్ట్‌హౌస్ మూలమలుపు వద్దకు రాగానే ఏటూరునాగారం బస్‌స్టాండ్ నుండి ఎదురుగా వస్తున్న ఆర్‌టిసి బస్సు అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకోనడంతో ఒకరు అక్కడికక్కడే చనిపోగా ఒకరికి తీవ్రగాయలు అయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా భూపాలపట్నం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నాగేష్(22) అతని తమ్ముడు మోహన్‌లు మేడారం వెళ్ళి తల్లులను దర్శించుకుని ద్విఛ క్రవాహనం పై వస్తుండగా ఎదురుగా వస్తున్న ఎపి29జడ్ 3491 ఆర్‌టిసి బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకోనడంతో కుమ్మరి నాగేష్ అక్కడికక్కడే మృతి చెందడాని మోహన్‌కు స్వల్ప గాయలు కాగా ఆయనను మండల కేంద్రంలోని సామజిక వైద్యశాలకు తరలించి వైద్యం అందించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పంచానామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సమాజిక వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైనా ఆర్‌టిసి బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకోట్టిన ఆర్‌టిసి బస్సు
- Advertisement -
- Advertisement -