Wednesday, April 24, 2024

ఇద్దరు మహిళలపై పెరుగుతో దాడి..

- Advertisement -
- Advertisement -

ఇరాక్: ఇద్దరు మహిళలపై వ్యక్తి పెరుగుతో దాడి చేసిన సంఘటన ఇరాక్ లోని మషాద్ నగరంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానిక పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఇరాన్ ప్రభుత్వం అక్కడ మహిళల డ్రెస్ కోడ్ కి సంబంధించి కోత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం 7 సంవత్సరాల వయస్సున్న బాలికతో సహా మహిళలంతా బహిరంగా ప్రదేశాల్లో తప్పనిసరిగా హిజాబ్ దరించాలి. ఒకవేళ ఎవరైన ధరించకపోతే రూ. 49 లక్షలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అయితే తాజాగా ఓ వ్య్తక్తి కిరాణ సరుకులు కోనడానికి షాప్ దగ్గరికి వెళ్లాడు.

అక్కడ ఇద్దరు మహిళలు తల్లి కూతుళ్లు హిజాబ్ ధరించకుండా కనిపించారు. దీంతో కోపోద్రికుడైన వ్యక్తి తల్లి కూతుళ్లపై ఆ షాప్ లో కోన్న పెరుగుతో దాడి చేశాడు. అడ్డుకోబోయిన షాప్ యజమానిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ముగ్గురుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరిలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News