Home జాతీయ వార్తలు చెన్నైలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

చెన్నైలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

Road-Accidentచెన్నై: తమిళనాడులోని నందనంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణీకులు బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం తక్షణమే సమీప దవాఖానకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. మృతులను ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థినులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ రోడ్డు ప్రమాద ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Two Women Died in Road Accident at Chennai