Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి

Two Women Dies In Road Accident At Sangareddyసంగారెడ్డి: నారాయణఖేడ్‌ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని రాజీవ్ చౌక్‌ వద్ద అతివేగంగా వచ్చిన ఓ కారు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు ఘటనాస్థలిలోనే చనిపోయారు. వేగంగా వచ్చిన కారు ఢీకొని విద్యుత్ స్తంభాలు, పాన్ డబ్బాలు కూడా ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. మృతులు  పారిశుద్ధ్య కార్మికులు సత్తమ్మ, వెంకమ్మగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం సత్తమ్మ, వెంకమ్మల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.