Home తాజా వార్తలు అత్తాకోడళ్లను చంపిన దుండగులు

అత్తాకోడళ్లను చంపిన దుండగులు

murder at RRరంగారెడ్డి:  మైలార్‌దేవుపల్లి పరిధి వట్టేపల్లి రోషన్‌కాలనీలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లోకి ప్రవేశించి అత్తా, కోడలిని దారుణంగా హత్య చేశారు. మృతులను అత్త నబీనాబేగం(55), కోడలు తాయబ్(25)లుగా గుర్తించారు. భర్త సోమవారం రాత్రి విధులకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్కాడ్ సిబ్బందితో ఘటనాస్థలంలో పరిశీలిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం  ఉస్మానియా మార్చురీకి తరలించారు.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.

two women murder in rangareddy