Home తాజా వార్తలు కెమి‘కిల్స్’

కెమి‘కిల్స్’

 Reactor Explode

 

రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు దుర్మరణం

హైదరాబాద్ శివారు జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని జివికా లైఫ్ సైన్స్ రసాయన పరిశ్రమలో ప్రమాదం

కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని జీవికా లైఫ్‌సైన్స్ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరో నలుగురు గాయాల పాలయ్యారు. మేడ్చల్ జిల్లా కు త్బుల్లాపూర్ నియోజికవర్గం జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని జీవికా లైఫ్‌సైన్స్ కెమికల్ పరిశ్రమలో కార్మికులు పనులు చేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. ఈ ధాటికి పరిశ్రమ రేకులు తునాతునకలయ్యాయి. పరిశ్రమలో పూర్తిగా రసాయన పొగ నిండి పోవడంతో కార్మికులు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పేలుడు ధాటికి పరిశ్రమలోని వస్తువులు పూర్తిగా ధ్వంసం కాగా చు ట్టుపక్కల ఆపి ఉన్న వాహనాలు సైతం ధ్వంసం అయ్యాయి.

జీడిమెట్ల పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కార్మికులను కాపాడేందుకు శ్రమించారు. పరిశ్రమ పూర్తి గా విషవాయువుతో నిండిపోవడంతో తీవ్రగాయాల పాలైన కార్మికుడు అన్వర్ అక్కడిక్కడే మృతిచెందగా అం బ్రేష్ అనే కార్మికుడు తీవ్రంగా గాయలపాలయ్యాడు. మంటల్లో గాయాలపాలైన అంబ్రేష్‌తో పాటు మరో నలుగురిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అంబ్రేష్ మృత్యువాత పడగా మిగితా కార్మికులు సురక్షితంగానే ఉన్నారని సిఐ రమణారెడ్డి తెలిపారు.

పరారీలో పరిశ్రమ యాజమాన్యం, నిర్వాహకులపై కేసు
రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికుల మృతికి కారకులైన జీవికా లైఫ్ సైన్స్ పరిశ్రమ యాజమాన్యంపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన సమయం నుండే యాజమాన్యం పరారీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారి వివరాలు సేకరించి దర్యాప్తు చేపడుతున్నామని సిఐ తెలిపారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది,జీడిమెట్ల పొలీసులతో పాటు కుత్బుల్లాపూర్ వైద్యశాఖ అధికారులు సైతం వచ్చి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించిన జీడిమెట్ల పొలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు సిఐ రమణా రెడ్డి వెల్లడించారు.

Two Workers died in Reactor Explode