Thursday, April 25, 2024

కోల్‌కతాలో పురాతన భవనం కూలి ఇద్దరి మృతి

- Advertisement -
- Advertisement -

Two workers killed in building collapse in Kolkata

కోల్‌కతా: ఉత్తర కోల్‌కతాలోని అహిరితొల వీధిలో బుధవారం భారీ వర్షాల కారణంగా ఒక ఇంటి పైకప్పు కూలిపోయి ఇద్దరు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని అత్యంత పురాతన ప్రాంతాలలో ఒకటైన జొరాబగన పోలీసు స్టేషన్ పరిధిలోని అహిరితొల వీధిలో ఉదయం 6.40 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కోల్‌కత మున్సిపల్ కార్పొరేషన్ గతంలోని పురాతన భవనంగా ప్రకటించిన ఈ ఇంటి శిథిలాల కింద నుంచి 9 మందిని కాపాడినట్లు అధికారులు చెప్పారు. ఈ సంఘటనలో ఒక మహిళ, ఆమె రెండేళ్ల మనవరాలు చనిపోయారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. శిథిలావస్థలో ఉన్న ఈ భవనంలో రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News