Home తాజా వార్తలు టివి మీదపడి రెండేళ్ల బాలుడు మృతి

టివి మీదపడి రెండేళ్ల బాలుడు మృతి

 

నిజామాబాద్: టివి మీద పడి రెండేళ బాలుడు దుర్మరణం చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట తండాతో చోటుచేసుకుంది. నందిని-హరి దంపతుల తనయుడు కుమారుడు హర్ష నవంబర్ 3న ఆడుకుంటూ వెళ్లి టివి పెట్టిన స్టాండ్‌ను గట్టిగా పట్టుకున్నాడు. టివి ఆ బాలుడిపై పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం ఆ బాలుడు మృతి చెందాడు. దీంతో వీరన్నగుట్టతండాలో విషాదచాయలు అలుముకున్నాయి. బాలుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

 

Two Years Old Boy Died after TV fell in Nizamabad