Home తాజా వార్తలు టిప్పర్ – లారీ ఢీ… ఇరువురి మృతి

టిప్పర్ – లారీ ఢీ… ఇరువురి మృతి

Road accident

 

టేకులపల్లి : మండల కేంద్రం నుంచి కోయగూడెం ఓసికి వెళ్లే రహదారిలో మంగలితండా గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి చెందారు. టేకులపల్లి నుంచి కిష్టారం గ్రామంకు బైక్ పై వెళుతున్న ఇరువురిని కోయగూడెం ఓసి నుంచి బొగ్గులోడుతో వస్తున్న టిప్పర్ లారీ ఎదురుగా అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఇరువురు వ్యక్తులు జబ్బాప్రసాద్ (20), కుర్సాభాను (21)లు రోడ్డుపై పడిపోయారు. అయితే లారీ వారిపై నుంచి వెళ్లడంతో తలకు, కాళ్ళుచేతులకు తీవ్రగాయాలయ్యాయి.

వీరిలో ఒకరు ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరిని 108 అంబులెన్స్  లో ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రి లో చికిత్స పొందుతూ కుర్సాభాను కూడా మృతి చెందాడు. కాగా వీరిరువురు కిష్టారం గ్రామానికి చెందిన వారు. మండల కేంద్రంలో పనిముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా టేకులపల్లి పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Two young mans died by Road accident