Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

Road Accidentసంగారెడ్డి : జహీరాబాద్ మండలం అల్లోల్ గ్రామం వద్ద 65వ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. కారు, బైకు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు ఘటనాస్థలిలోనే చనిపోయారు.  బైక్ కారు కింద పడి నుజ్జునుజ్జయింది.  కారు ముందు భాగం ధ్వంసమయింది. మృతుల వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Two Young Men Dead In Road Accident At Sangareddy