Home Default ఇద్దరు యువకుల ప్రాణం తీసిన టిక్ టాక్ వీడియో

ఇద్దరు యువకుల ప్రాణం తీసిన టిక్ టాక్ వీడియో

బెంగళూరు: రైలు పట్టాలపై టిక్ టాక్ వీడియో తీస్తూ వేగంగా వస్తున్న రైలు కింద పడి ఇద్దరు యువకులు మరణించారు. బెంగళూరులోని యలహంక, చన్నసంద్ర మధ్య శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. మృతులను 19 ఏళ్ల అఫ్తాబ్ షరీఫ్, అతని మిత్రుడు 23 ఏళ్ల మొహమ్మద్ మాటిన్‌గా గుర్తించారు. ఈ వీడియోను చితీకరిస్తున్న మూడవ వ్యక్తి 22 ఏళ్ల జబీవుల్లా ఖాన్ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. రైలు ట్రాకుల అవతల పడి ఉన్న జబీవుల్లాను స్థానికులు యలహంకలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ముగ్గురూ బెంగళూరులోని ఆర్‌కె హెగ్డే నగర్ వాసులని తెలుస్తోంది.

Two youths run over by train for making TikTok video,The incident took place on Friday evening on the railway tracks between Yelahanka and Channasandra.