Home తాజా వార్తలు ‘సాహో’ సినిమాకి U/A సర్టిఫికెట్

‘సాహో’ సినిమాకి U/A సర్టిఫికెట్

Saahoహైదరాబాద్ : ప్రముఖ హీరో ప్రభాస్, బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ జంటగా నటించిన ‘సాహో’ సినిమా ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుందని సినిమా యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చిందని సినిమా యూనిట్ తెలిపింది. ఈ సినిమా నిడివి 2గంటల 51 నిమిషాల 52 సెకన్లుగా ఉంది. హాలీవుడ్ తరహా యాక్షన్ స్వీక్వెన్స్ తో ఈ సినిమా తెరకెక్కింది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించారు. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘సాహో’. దీంతో ‘సాహో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

U/A Certificate To Hero Prabhas ‘Saaho’ Movie