Friday, April 19, 2024

అంగారక, బృహస్పతి మధ్య గ్రహశకలంపై యుఎఇ పరిశోధన

- Advertisement -
- Advertisement -

UAE research on asteroid between Mars and Jupiter

2028 లో వ్యోమనౌక ప్రోబ్‌ను పంపే యత్నం

దుబాయ్ : అంగారక, బృహస్పతి గ్రహాల మధ్యనున్న గ్రహశకలం నుంచి విశ్వం మూలాలకు సంబంధించిన డేటా సేకరణకు పరిశోధక నౌక ప్రోబ్‌ను పంపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మంగళవారం వెల్లడించింది. ఇది అరబ్ ఎమిరేట్స్ తాజా అద్భుత కార్యక్రమం. ఈ ప్రాజెక్టులో 2028 లో ప్రోబ్‌ను ప్రయోగించడానికి, ఐదేళ్ల పాటు ఇది ప్రయాణించి 2033 లో గ్రహశకలంపై దిగేలా సంకల్పించారు. ఈ అయిదేళ్ల యాత్రలో వ్యోమనౌక దాదాపు 3.6 బిలియన్ కిలోమీటర్లు (2.2 బిలియన్ మైళ్లు ) ప్రయాణిస్తుంది. యూనివర్శిటీ ఆఫ్ కొలరడో కు చెందిన అట్మాస్ఫియరిక్ లేబొరేటరీ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నట్టు యుఎఇ వెల్లడించింది. ఫిబ్రవరిలో అంగారక గ్రహ కక్షలో విజయవంతంగా తన హోప్ వ్యోమనౌకను ప్రవేశ పెట్టిన తరువాత ఈ ప్రాజెక్టును యుఎఇ చేపట్టింది. ఒక కారు సైజులో ఉండే హోప్ తయారీకి, ప్రయోగించడానికి దాదాపు 200 బిలియన్ డాలర్లను యుఎఇ ఖర్చు పెట్టింది. ఇదే విధంగా 2024 లో చంద్రుని పైకి మానవ రహిత వ్యోమనౌకను పంపాలన్న లక్షం పెట్టుకుంది. అంగారక గ్రహంపై 2117 నాటికి మానవ నివాస కాలనీని నిర్మించాలన్న లక్షంతో ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News