Home జాతీయ వార్తలు ఆ ఊబర్ డ్రైవర్ నరకం చూపించాడు

ఆ ఊబర్ డ్రైవర్ నరకం చూపించాడు

 

బెంగళూరు: మహిళా ప్రయాణికుల పట్ల ఊబర్ డ్రైవర్లు ఎంత దురుసుగా, అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారనడానికి మరో తాజా సంఘటన ఇది. తన కారు ఎక్కిన ఒక మహిళ పట్ల ఊబర్ డ్రైవర్ అత్యంత నీచంగా వ్యవహరించడమేకాక ఆమె బట్టలు చించివేస్తానంటూ బెదిరించి ఆమెను అర్ధరాత్రి నడిరోడ్డుపై దింపివేశాడు. శనివారం రాత్రి బెంగళూరులో ఈ దారుణం చోటుచేసుకుంది. బాధిత మహిళ తన ఫేస్‌బుక్ పేజ్‌లో ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనను పోస్ట్ చేసింది. ఆమె కథనం ప్రకారం&తన సహ ఉద్యోగులతో కలసి ఆమె డన్నర్ వెళ్లిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు ఊబర్ క్యాబ్ బుక్ చేసింది. కారులో కూర్చున్న ఆమెకు క్యాబ్ డ్రైవర్ సెల్‌ఫోన్‌లో తన గురించి నీచంగా వర్ణించడం వినిపించింది. హఠాత్తుగా డ్రైవర్ ఆమె వైపు తిరిగి చదువుకున్న మహిళలు రాత్రి 7 గంటల కల్లా పని పూర్తిచేసుకుని ఇంటికి చేరుకోవాలని, ఇలా రాత్రి దాకా తాగి రాకూడదంటూ క్లాసు తీసుకోసాగాడు.

తాను తాగలేదని, అయినప్పటికీ నీ పని నువ్వు చూసుకోమని ఆమె చెప్పింది. ఆమెను ఒక బూతు పదంతో తిట్టిన డ్రైవర్ నువ్వు నా చెప్పులు తుడవడానికి కూడా నువ్వు పనికిరావు అంటూ అరిచాడు. ఇంతలో డ్రైవర్ కారు వేగం తగ్గించడంతో భయపడిపోయిన ఆమె తన మొబైల్‌లోని యూబర్ యాప్‌లో సేఫ్టీ బటన్ నొక్కింది. అయితే ఊబర్ కస్టమర్ కేర్ సిబ్బంది ఆమె మొబైల్‌కు కాల్ చేయకుండా డ్రైవర్‌కు కాల్ చేసి ఏమైందని అడిగారు. తన కారులో కూర్చున్న మహిళ పూర్తిగా మద్యం మత్తులో ఉందని అతను ఫిర్యాదు చేశాడు. ఈ సమయంలో చేసేది లేక ఆ మహిళ గట్టిగా అరుస్తూ తన మాటలు కూడా వినాలని కస్టమర్ కేర్‌ను కోరింది.

ఆ తర్వాత ఆమెతో మాట్లాడిన కస్టమర్ కేర్ సిబ్బంది వెంటనే కారు దిగిపోవాలని, వేరే కారు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇది విని రెచ్చిపోయిన డ్రైవర్ వెంటనే కారు దిగకపోతే నీ బట్టలు చింపేస్తానంటూ ఆమె బెదిరించాడు. రాత్రి 11.15 ప్రాంతంలో నిర్జన ప్రదేశంలో తనను వదిలేసి క్యాబ్ డ్రైవర్ వెళ్లిపోయాడని, మరో క్యాబ్ పంపిస్తామన్న ఊబర్ సిబ్బంది స్పందించకపోవడంతో తన మిత్రులకు ఫోన్ చేసి వారి కారులో ఇంటికి చేరుకున్నానని బాధితురాలు వివరించింది. కాగా&ఆమె ఫేస్‌బుక్ పోస్టుకు స్పందించిన యూబర్ ప్రతినిధి ఆ మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్ శివకుమార్‌ను తమ యాప్ సర్వీసు నుంచి సస్పెండ్ చేశామని, ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.

 

Uber Driver Misbehaves with Bangaluru Woman
Uber Driver Misbehaves with Bangaluru Woman, the driver Sivakumar forced her out of the cab while the Uber app was of no help